గుత్తి : గుత్తి ఆర్‌ఎస్ రైల్వే క్వార్టర్స్‌లో మంగళవారం పట్టపగలే మహిళ మెడలో గొలుసు చోరీకి గురైంది. వివరాలిలా ఉన్నాయి. ఆర్‌ఎస్ క్వార్టర్స్‌లో ఉంటున్న రైల్వే ఉద్యోగి రమణమ్మ యథావిధిగా మధ్యాహ్నం భోజనం చేసి విధులకు బయలుదేరింది.
మహిళ మెడలో గొలుసు అపహరణ
Feb 15 2017 12:46 AM | Updated on Sep 5 2017 3:43 AM
గుత్తి : గుత్తి ఆర్‌ఎస్ రైల్వే క్వార్టర్స్‌లో మంగళవారం పట్టపగలే మహిల మెడలో గొలుసు చోరీకి గురైంది. వివరాలిలా ఉన్నాయి. ఆర్‌ఎస్ క్వార్టర్స్‌లో ఉంటున్న రైల్వే ఉద్యోగి రమణమ్మ యథావిధిగా మధ్యాహ్నం భోజనం చేసి విధులకు బయలుదేరింది. స్టేషన్ వద్దకు రాగానే వెనుక నుంచి వచ్చిన ఓ యువకుడు ఆమె మెడలోని మూడు తులాల బంగారు గొలుసు లాక్కెళ్లాడు. బాధితురాలు తన భర్తతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ చాంద్‌బాషా తెలిపారు.
Advertisement
Advertisement