వివాహిత ఆత్మహత్య | woman suicides | Sakshi
Sakshi News home page

వివాహిత ఆత్మహత్య

Jul 19 2017 10:37 PM | Updated on Sep 5 2017 4:24 PM

వంకరాజుకాల్వ గ్రామంలో అశ్విని (22) అనే వివాహిత బుధవారం ఆత్మహత్య చేసుకుంది.

పామిడి: వంకరాజుకాల్వ గ్రామంలో అశ్విని (22) అనే వివాహిత బుధవారం ఆత్మహత్య చేసుకుంది. ఎస్‌ఐ రవిశంకర్‌రెడ్డి తెలిపిన మేరకు... గుంతకల్‌ మండలం దోసలుడికి గ్రామానికి చెందిన అక్క నాగేశ్వరమ్మ కుమార్తె అశ్వినిని పామిడి మండలం వంకరాజుకాల్వకు చెందిన శెట్టి బలిజ రామాంజనేయులు నాలుగేళ్ల కిందట వివాహం చేసుకున్నాడు. వీరికి సంతానం లేదు. రామాంజనేయులు బుధవారం ఉదయాన్నే పొలానికి వెళ్ళాడు.

సాయంత్రం తిరిగి వచ్చేసరికి ఇంట్లో భార్య అశ్విని ఫ్యానుకు చీరతో ఉరివేసుకుని ఉండటం కనిపించింది. చుట్టుపక్కల వారి సాయంతో ఆమెను కిందకు దింపి పామిడి కమ్యూనిటీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కడుపునొప్పి భరించలేకే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటుందని బంధువులు చెబుతున్నారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement