పిడుగు పడి మహిళ మృతి | Woman dies in lighting in anantapur | Sakshi
Sakshi News home page

పిడుగు పడి మహిళ మృతి

Oct 2 2015 5:06 PM | Updated on Jun 1 2018 8:39 PM

పిడుగు పడి మహిళ మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.

అనంతపురం : పిడుగు పడి మహిళ మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన అనంతపురం జిల్లా డి.ఇరెహాల్ మండలం వసగుడ్డం గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలు ... గ్రామానికి చెందిన మహిళ నీలమ్మ (38) తోపాటు  ఇద్దరు కూలీలు వ్యవసాయ పొలంలో పనులు చేసుకుంటున్నారు.

ఆ సమయంలో భారీ వర్షం వచ్చింది. దీంతో కూలీలు చెట్ల కిందకు పరుగులు తీశారు. అదే సమయంలో చెట్టుపై పిడుగు పడింది. ఈ ఘటనలో నీలమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పొలంలోని కూలీలు వెంటనే స్పందించి క్షతగాత్రులను అనంతపురంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement