విష జ్వరంతో మహిళ మృతి | woman died of with fever | Sakshi
Sakshi News home page

విష జ్వరంతో మహిళ మృతి

Jul 25 2016 8:59 PM | Updated on Sep 4 2017 6:14 AM

తీవ్రమైన విషజ్వరంతో ఓ మహిళ మృతి చెందిన ఘటన వరంగల్‌ జిల్లా నర్మెట మండలం అక్కరాజుపల్లిలో సోమవారం చోటుచేసుకుంది.

 నర్మెట : తీవ్రమైన విషజ్వరంతో ఓ మహిళ మృతి చెందిన ఘటన వరంగల్‌ జిల్లా నర్మెట మండలం అక్కరాజుపల్లిలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కర్రె గంగవ్వ(50) విషజ్వరంతో రెండు రోజులుగా బాధపడుతోంది. ఆదివారం రాత్రి వాంతులు చేసుకుంది. తెల్లవారాక ఆస్పత్రికి తీసుకెళ్దామని కుటుంబసభ్యులు భావించారు. కానీ తెల్లవారేసరికే గంగవ్వ మృతి చెందింది. ఆమెకు వికలాంగుౖyð న భర్త ఎల్లయ్య, ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement