ప్రేమ పేరుతో వంచించి మోసం చేసిన యువకుడితో పెళ్లి జరిపించాలని ప్రియుడి ఇంటి ముందు నిరసనకు దిగిందో యువతి.
బాపట్ల(గుంటూరు): ప్రేమ పేరుతో వంచించి మోసం చేసిన యువకుడితో పెళ్లి జరిపించాలని ప్రియుడి ఇంటి ముందు నిరసనకు దిగిందో యువతి. తన వంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యువతిని ఆస్పత్రికి తరలించారు. యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన బాల మురళికృష్ణ అదే ప్రాంతానికి చెందిన జ్యోతి అనే యువతిని ప్రేమ పేరుతో మోసం చేశాడు.
ఏడు నెలల గర్భవతి అయిన జ్యోతిని పెళ్లాడటానికి మురళికృష్ణ నిరాకరించడంతో.. అతని ఇంటి ముందే యువతి వంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.