మాట్లాడుతున్న ఏపీఎస్‌టీయూఎస్ అధ్యక్షుడు పైడితల్లి
ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 9న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గిరిజన ఉద్యోగ, ఉపాధ్యాయులకు సెలవు ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు అడ్డూరి పైడితల్లి డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గిరిజన ఉద్యోగ, ఉపాధ్యాయుల సంఘాలు స్థానిక బీఎస్‌ఎన్‌ఎల్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘ కార్యాలయంలో ఆదివారం సమావేశం నిర్వహించారు.
♦ గిరిజన ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల డిమాండ్
విజయనగరం అర్బన్: ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 9న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గిరిజన ఉద్యోగ, ఉపాధ్యాయులకు సెలవు ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు అడ్డూరి పైడితల్లి డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గిరిజన ఉద్యోగ, ఉపాధ్యాయుల సంఘాలు స్థానిక బీఎస్‌ఎన్‌ఎల్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘ కార్యాలయంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 9న విజయనగరం డివిజన్ పరిధిలోని ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని స్థానిక అమర్‌భవనంలో నిర్వహిస్తామన్నారు. ఇందులో భాగంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తామని తెలిపారు. అదేవిధంగా గిరిజన హక్కుల పరిరక్షణ కోసం చర్చా వేదిక చేపడతామన్నారు. అదేవిధంగా పార్వతీపురం డివిజన్ పరిధిలో ఆదివాసీ దినోత్సవాన్ని గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో నిర్వహిస్తామని చెప్పారు. సంబంధిత కార్యక్రమాలకు ఉద్యోగ, ఉపాధ్యాయ మిత్రులు హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో సంఘ నాయకులు అమర్‌నాథ్, నాగేశ్వరరావు, వెంకటరావు, లక్ష్మీనారాయణ, టి.అప్పలరాజు, తవిటందొర, సురేష్, తదితరులు పాల్గొన్నారు.