'తక్షణమే తాగునీటి సమస్యను పరిష్కరించాలి' | Water problems should be solved immediatly, says Yv subba reddy | Sakshi
Sakshi News home page

'తక్షణమే తాగునీటి సమస్యను పరిష్కరించాలి'

Feb 6 2016 2:34 PM | Updated on Sep 3 2017 5:04 PM

ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్లో శనివారం విజిలెన్స్ అండ్ మానిటరింగ్ సమావేశం జరిగింది.

ప్రకాశం: ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్లో శనివారం విజిలెన్స్ అండ్ మానిటరింగ్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కమిటీ చైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు ఎంపీ,  వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో పలు అభివృద్ధి పథకాలు, తాగునీటి సమస్యలపై అధికారులను ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు.

ఆయనతోపాటు ఎమ్మెల్యేలు అశోక్ రెడ్డి, జంకె వెంకట్ రెడ్డి, ఆదిమూలపు సురేశ్, వీరాంజనేయ స్వామి తదితరులు పాల్గొన్నారు. తక్షణమే జిల్లాలో తాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ వారు అధికారులను ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement