కన్నీటి కష్టాలు | water problems in kgbv school | Sakshi
Sakshi News home page

కన్నీటి కష్టాలు

Sep 10 2016 11:51 PM | Updated on Sep 4 2017 12:58 PM

కన్నీటి కష్టాలు

కన్నీటి కష్టాలు

స్థానిక కేజీబీవీ (కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల)లో తాగునీటి ఎద్దడి నెలకొంది.

చిలమత్తూరు : స్థానిక కేజీబీవీ (కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల)లో తాగునీటి ఎద్దడి నెలకొంది. పాఠశాలలో సుమారు 200 మంది విద్యార్థినులు ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుకుంటున్నారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన బోరుకు సంబంధించిన మోటార్లు రెండు రోజుల క్రితం కాలిపోవడంతో సమస్య తలెత్తింది. దీంతో విద్యార్థులు నీటి కోసం నానా కష్టాలు పడుతున్నారు.

పాఠశాల ఎదురుగా ఉన్న ఇటుకల ఫ్యాక్టరీలోని బోరు వద్దకు వెళ్లి బిందెలు, బకెట్లతో నీరు తెచ్చుకుంటున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వెంటనే మోటారుకు మరమ్మతులు చేయించి నీటి సమస్య తీర్చాలని విద్యార్థినులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement