జూరాలకు కొనసాగుతున్న వరద | Water Flow to Jurala | Sakshi
Sakshi News home page

జూరాలకు కొనసాగుతున్న వరద

Aug 19 2016 10:49 PM | Updated on Sep 4 2017 9:58 AM

జూరాల : కర్ణాటక నుంచి జూరాల ప్రాజెక్టుకు శుక్రవారం ఇన్‌ఫ్లో వరద కొనసాగుతుంది. 23వేల క్యూసెక్కుల వరద వస్తుండగా జలవిద్యుత్‌ కేంద్రంలో మూడు టర్బైన్లలో 110 మెగావాట్ల విద్యుదుత్పత్తిని కొనసాగిస్తూ దిగువ నదిలోకి 24వేల క్యూసెక్కుల వరదను విడుదల చేస్తున్నారు.

– మూడు టర్బైన్లలో విద్యుదుత్పత్తి
జూరాల : కర్ణాటక నుంచి జూరాల ప్రాజెక్టుకు శుక్రవారం ఇన్‌ఫ్లో వరద కొనసాగుతుంది. 23వేల క్యూసెక్కుల వరద వస్తుండగా జలవిద్యుత్‌ కేంద్రంలో మూడు టర్బైన్లలో 110 మెగావాట్ల విద్యుదుత్పత్తిని కొనసాగిస్తూ దిగువ నదిలోకి 24వేల క్యూసెక్కుల వరదను విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటినిల్వ 9.65 టీఎంసీలు కాగా ప్రస్తుతం 9.33 టీఎంసీల నీటినిల్వను కొనసాగిస్తున్నారు. జూరాల రిజర్వాయర్‌ ద్వారా నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్‌ ఎత్తిపోతల పథకాల పంపుల ద్వారా నీటిని పంపింగ్‌ చేస్తున్నారు. కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 129.72 టీఎంసీలుగా కాగా ప్రస్తుతం 123.08 టీఎంసీల నీటినిల్వను కొనసాగిస్తున్నారు. పై నుంచి రిజర్వాయర్‌కు 17,980 క్యూసెక్కుల వరద వస్తుంది. ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా 20వేల క్యూసెక్కుల వరదను దిగువ నదిలోకి విడుదల చేస్తున్నారు.
 
        ప్రాజెక్టులో అన్ని క్రస్టుగేట్లను మూసివేశారు. ఆల్మట్టి ప్రాజెక్టుకు దిగువన కర్ణాటకలోనే ఉన్న నారాయణపూర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 37.64 టీఎంసీలు. ప్రస్తుతం 32.37 టీఎంసీల నీటినిల్వను కొనసాగిస్తున్నారు. రిజర్వాయర్‌లో నీటిమట్టాన్ని పూర్తిస్థాయికి పెంచుతున్నందున విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా కేవలం 6వేల క్యూసెక్కుల వరదను జూరాల ప్రాజెక్టు రిజర్వాయర్‌కు విడుదల చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement