చౌటుపర్తి అబ్బాయి.. లండన్ అమ్మాయి | warangal boy married to london girl | Sakshi
Sakshi News home page

చౌటుపర్తి అబ్బాయి.. లండన్ అమ్మాయి

Nov 6 2015 1:17 PM | Updated on Sep 3 2017 12:08 PM

చౌటుపర్తి అబ్బాయి.. లండన్ అమ్మాయి

చౌటుపర్తి అబ్బాయి.. లండన్ అమ్మాయి

ఈ ప్రాంతం కాదు ఈ దేశం అంతకన్న కాదు.. మన భాష రాదు.. మన యాస తెలియదు..అయినా ఆ రెండు మనస్సులు కలిశాయి.

పరకాల : ఈ ప్రాంతం కాదు ఈ దేశం అంతకన్న కాదు.. మన భాష రాదు.. మన యాస తెలియదు..అయినా ఆ రెండు మనస్సులు కలిశాయి. దీంతో వారు గురువారం ఒక్కటయ్యూరు. పెద్దల సమక్షంలో అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లా పరకాల మండలంలోని చౌటుపర్తికి చెందిన గోగుల రాజిరెడ్డి, ప్రేమలత దంపతుల కుమారుడు గోగుల విజేందర్‌రెడ్డి ఎంబీఏ పూర్తిచేసి ఉద్యోగం కోసం రెండేళ్ల క్రితం లండన్‌కు వెళ్లారు.

అక్కడ హోటల్ మేనేజ్‌మెంట్ చేస్తుండగా లండన్‌కు చెందిన జానో, ఈవో దంపతుల కుమార్తె లెంక పరిచయమయ్యూరు. ఆమె పోస్టాఫీస్‌లో ఉద్యోగం చేసేవారు. లెంక ఇంటి పక్కనే విజేందర్‌రెడ్డి అద్దెకు ఉంటున్నారు. ఈక్రమంలోనే ఇద్దరి మధ్య ఏర్పడి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈవిషయం తెలుసుకున్న అమ్మాయి తల్లిదండ్రులు ఇద్దరి పెళ్లికి ఒప్పుకున్నారు. దీంతో  హన్మకొండలోని ఓ ఫంక్షన్ హాల్‌లో వారి వివాహం నిన్న జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement