వీఆర్‌ఏల ర్యాలీ, కలెక్టరేట్‌ ఎదుట ధర్నా | VRA'S rally | Sakshi
Sakshi News home page

వీఆర్‌ఏల ర్యాలీ, కలెక్టరేట్‌ ఎదుట ధర్నా

Sep 9 2016 12:26 AM | Updated on Sep 4 2017 12:41 PM

సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో ఆందోళన చేస్తున్న తమ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వీఆర్‌ఏ(డీఆర్‌)ల సంఘం జిల్లా అధ్యక్షులు కరుణాకర్‌ అన్నారు. ఈనెల 2వ తేదీ నుంచి హన్మకొండ ఏకశిలా పార్కు వద్ద ఆందోళన చేస్తున్న వీఆర్‌ఏలు గురువారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేశారు. తొలుత కలెక్టరేట్‌ వరకు ర్యాలీగా వచ్చారు.

హన్మకొండ అర్బన్‌ : సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో ఆందోళన చేస్తున్న తమ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వీఆర్‌ఏ(డీఆర్‌)ల సంఘం జిల్లా అధ్యక్షులు కరుణాకర్‌ అన్నారు. ఈనెల 2వ తేదీ నుంచి హన్మకొండ ఏకశిలా పార్కు వద్ద ఆందోళన చేస్తున్న వీఆర్‌ఏలు గురువారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేశారు. తొలుత కలెక్టరేట్‌ వరకు ర్యాలీగా వచ్చారు.
 
ఈ సందర్భంగా కరుణాకర్‌  మాట్లాడుతూ పార్ట టైం ఉద్యోగులుగా నియమితులైన తమతో ఫుల్‌ టైం పనులు చేయిస్తున్నారని అన్నారు. అయినా సమస్యలు పరిష్కరించడం లేదని వాపోయారు. అనంతరం డీఆర్వోకు వినతిపత్రం అందజేశారు. కాగా, వీఆర్‌ఏల ఆందోళనకు డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డితో పాటు నాయకులు ఈ.వీ.శ్రీనివాస్, బత్తిని శ్రీనివాస్‌ తదితరులు సంఘీభావం తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement