ధర్మవరం అర్బన్: పోలీసు కస్టడీలో ఉన్న అంతర్‌రాష్ట్ర ఏటీఎం దొంగ మధుకర్‌రెడ్డి నుంచి ధర్మవరం పట్టణ పోలీసులు కీలక సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. పోలీసులు నాలుగురోజులపాటు ఇతడిని కస్టడీలోకి తీసుకున్నారు.
అప్పట్లో హత్య కేసు నమోదైంది. ఆ హత్య కేసుకు సంబంధించి పోలీసులు విచారించారు. ఇంకా పలు కేసులను మధుకర్‌రెడ్డి అంగీకరించినట్లు తెలుస్తోంది. బెంగళూరు నగరంలో ఎక్కువగా ఏటీఎంలలో దోపిడీలు చేసినట్లు విచారణలో వెల్లడించినట్లు సమాచారం. ఇంకా మూడురోజులపాటు మధుకర్‌రెడ్డిని ధర్మవరం పట్టణ పోలీసులు విచారించనున్నారు. దీంతో మధుకర్‌రెడ్డి చేసిన మరిన్ని నేరాలు బయటపడే అవకాశం ఉంది.