మా ఊళ్లోకి రావొద్దు | villagers against to mla chand basha | Sakshi
Sakshi News home page

మా ఊళ్లోకి రావొద్దు

Nov 13 2016 4:21 AM | Updated on Sep 4 2017 7:55 PM

మా ఊళ్లోకి రావొద్దు

మా ఊళ్లోకి రావొద్దు

ఓ ఎమ్యెల్యే గ్రామంలోకి రాకూడదంటూ మార్గంలో ఫ్లెక్సీ వెలిసింది.

బూరుగుపల్లి (కదిరి అర్బన్‌) : మండల పరిధిలోని బూరుగుపల్లిలో ఎమ్యెల్యే అత్తార్‌చాంద్‌బాషా గ్రామంలోకి రాకూడదంటూ మార్గంలో ఫ్లెక్సీ వెలిసింది. కదిరి మండలంలో మొటుకుపల్లి, కౌలేపల్లి, కుమ్మరవాండ్లపల్లి, బూరుగుపల్లెల్లో శనివారం ఎమ్యెల్యే జనచైతన్య యాత్రలు నిర్వహించారు. గ్రామానికి ఎమ్యెల్యే వస్తున్నారన్న సమాచారంతో గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లెక్సీని చెట్టుకు కట్టారు.

పార్టీలు మారిన వారు జనచైతన్యయాత్రలు చేయవచ్చా ? అంటూ ఫ్లెక్సీలో ఉంది. ఫ్లెక్సీ ఎవరో కట్టారో.. ఎందుకు కట్టారో తెలియరాలేదు. మొటుకుపల్లిలో నిర్వహించిన జనచైతన్యయాత్రలో  తాగునీటి సమస్యను కొందరు ఎమ్యెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్యెల్యే వెంట ఎస్‌ఎండీ ఇస్మాయిల్, కాటం శంకర్, అల్ఫాముస్తఫాతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement