నయీం ఇంటి నుంచి వాహనాలు స్వాధీనం | vehicles seized from the Nayim house | Sakshi
Sakshi News home page

నయీం ఇంటి నుంచి వాహనాలు స్వాధీనం

Aug 10 2016 10:32 PM | Updated on Sep 4 2017 8:43 AM

మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగరలోని మిలీనియం కాలనీలోని నయీం ఇంటి నుంచి పోలీసులు బుధవారం పలు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

షాద్‌నగర్ : మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగరలోని మిలీనియం కాలనీలోని నయీం ఇంటి నుంచి పోలీసులు బుధవారం పలు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. రెండు కార్లు, ఒక స్కూటీని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కార్లు, స్కూటీ రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రేషన్‌ను కలిగి ఉన్నాయి. స్వాధీనం చేసుకున్న వాహనాలు ఎవరివి, ఎవరి పేరుమీద రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయన్న విషయమై పోలీసులు విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు నయీం ఇంటినుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తుల వివరాలకు కానీ, ఇతరత్రా అంశాలు బయటికి పొక్కనివ్వడం లేదు.
 

Advertisement
 
Advertisement
Advertisement