వాల్మీకి బోయలను ఎస్టీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ.. వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో
విజయవాడ: వాల్మీకి బోయలను ఎస్టీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ.. వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో శనివారం విజయవాడ అలంకార్ సెంటర్‌లో చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. తమ డిమాండ్‌లను తీర్చాలని కోరుతూ.. కార్యకర్తలు వాటర్ ట్యాంక్ ఎక్కడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వారిని కిందకు దించడానికి ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో ఓ వ్యక్తి ఒంటి పై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పరిస్థతి విషమంగా ఉంది.