రామగుండం ఎన్టీపీసీలో ఐక్యఫ్రంట్‌ | union forn win ntpc | Sakshi
Sakshi News home page

రామగుండం ఎన్టీపీసీలో ఐక్యఫ్రంట్‌

Sep 13 2016 11:46 PM | Updated on Sep 4 2017 1:21 PM

రామగుండం ఎన్టీపీసీలో ఐక్యఫ్రంట్‌

రామగుండం ఎన్టీపీసీలో ఐక్యఫ్రంట్‌

జ్యోతినగర్‌ : రామగుండం ఎన్టీపీసీలో మంగళవారం నిర్వహించిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో న్టీపీసీ డెమెుక్రటిక్‌ ఎంప్లæూస్‌ యూనియన్‌ (హెచ్‌ఎంఎస్‌ అనుబంధం) విజయం సాధించింది.

జ్యోతినగర్‌ : రామగుండం ఎన్టీపీసీలో మంగళవారం నిర్వహించిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో న్టీపీసీ డెమెుక్రటిక్‌ ఎంప్లæూస్‌ యూనియన్‌ (హెచ్‌ఎంఎస్‌ అనుబంధం) విజయం సాధించింది. స్థానిక ప్రాజెక్టు పరిపాలనా భవనంలో పోలింగ్‌ నిర్వహించారు. ప్రాజెక్టులో 693 మంది ఓటర్లుగా ఉన్నారు. ఎన్టీపీసీ మజ్దూర్‌ యూనియన్‌(ఐఎన్టీయూసీ), ఎన్టీపీసీ డెమెుక్రటిక్‌ ఎంప్లాÄæూస్‌ యూనియన్‌(హెచ్‌ఎంఎస్‌), ఎన్టీపీసీ కార్మిక సంఘ్‌(బీఎంఎస్‌), ఎన్టీపీసీ తెలుగునాడు ఎంప్లాÄæూస్‌ యూనియన్‌(టీఎన్టీయూసీ), ఎన్టీపీసీ యునైటెడ్‌ ఎంప్లాÄæూస్‌ యూనియన్‌(సీఐటీయూ), తెలంగాణ ఎన్టీపీసీ ఎంప్లాÄæూస్‌ యూనియన్, ఎన్టీపీసీ తెలంగాణ కార్మిక సంఘాలు గుర్తింపు సంఘం ఎన్నికల్లో పాల్గొనేందుకు అర్హత పొందాయి. అయితే, ఐఎన్టీయూసీ, హెచ్‌ఎంఎస్‌(ఐక్యఫ్రంట్‌), బీఎంఎస్, ఎన్టీకేఎస్‌ మాత్రమే ఎన్నికల్లో పోటీ చేశాయి. ఫలితాల్లో హెచ్‌ఎంఎస్‌/ఐక్యఫ్రంట్‌కు 311 ఓట్లు, ఐఎన్టీయూసీ అనుబంధ ఎన్టీపీసీ మజ్దూర్‌ యూనియన్‌కు 290 ఓట్లు, బీఎంఎస్‌ అనుబంధ ఎన్టీపీసీ కార్మిక సంఘ్‌కు 62 ఓట్లు, స్వతంత్ర ఎన్టీపీసీ తెలంగాణ కార్మిక సంఘానికి ఒక ఓటు వచ్చాయి. 311 ఓట్లు సాధించిన హెచ్‌ఎంఎస్‌ అనుబంధ ఎన్టీపీసీ డెమెుక్రటిక్‌ ఎంప్లాÄæూస్‌ యూనియన్‌ ప్రాజెక్టులో ప్రాతినిధ్యసంఘంగా అర్హత సాధించింది. ఐక్యకూటమి విజయంతో హెచ్‌ఎంఎస్, సీఐటీయూ, టీఆర్‌ఎస్‌/ఎన్టీకేఎస్, టీఎన్టీయూసీ, ఐఎఫ్‌టీయూ, స్వతంత్ర సంఘాల ఉద్యోగులు సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో నాయకులు సీహెచ్‌ ఉపేందర్, మాధవరావు, పెద్దంపేట శంకర్, ఉదయ్‌కుమార్, కొమ్ము గోపాల్, సత్యనారాయణరెడ్డి, అశోక్, హన్మంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇది ఉద్యోగుల విజయం : సీహెచ్‌ ఉపేందర్‌
ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు ఉద్యోగ గుర్తింపు సంఘం ఎన్నికల్లో హెచ్‌ఎంఎస్‌/ఐక్యకూటమి గెలవడం కార్మికుల విజయమని ఆ యూనియన్‌ ప్రధానకార్యదర్శి  సీహెచ్‌ ఉపేందర్‌ అన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక ఆయన మాట్లాడారు. ఐక్యఫ్రంట్‌ విజయానికి కృషి చేసిన హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్‌ సోమారపు సత్యనారాయణ, రామగుండం మేయర్‌ కొంకటీ లక్ష్మీనారాయణ, సీఐటీయూ ఎన్బీసీ సభ్యుడు దేవరాయ్, టీఆర్‌ఎస్‌ నాయకులు, ఫ్రంట్‌లో భాగస్వామ్య పక్షాలతో పాటు ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగుల హక్కుల పరిరణకు కృషి చేస్తానని ఉపేందర్‌ తెలిపారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement