జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మొత్తం 3.34 లక్షల యూనిఫాం పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సర్వశిక్షా అభియాన్ సీఎంఓ ఇంటి వెంకట్రావు తెలిపారు. కరప మండలం కొరుపల్లిలో మంగళవారం ఆయన డ్వాక్రా మహిళలు రూపొందిస్తున్న యూనిఫాంను పరిశీలించారు.
3.34 లక్షల యూనిఫాం పంపిణీ
Aug 23 2016 10:18 PM | Updated on Sep 4 2017 10:33 AM
సర్వశిక్షా అభియాన్ సీఎంఓ వెంకట్రావు
కరప:
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మొత్తం 3.34 లక్షల యూనిఫాం పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సర్వశిక్షా అభియాన్ సీఎంఓ ఇంటి వెంకట్రావు తెలిపారు. కరప మండలం కొరుపల్లిలో మంగళవారం ఆయన డ్వాక్రా మహిళలు రూపొందిస్తున్న యూనిఫాంను పరిశీలించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ డీఆర్‌డీఏ సౌజన్యంతో ఇప్పటివరకు 65 వేల మందికి యూనిఫాం సిద్ధం చేసినట్టు చెప్పారు. 55 మండలాల్లో డ్వాక్రా మహిళలు వీటిని కుడుతున్నారని, ఒకొక్క విద్యార్థికి రెండు జతలు ఇస్తున్నట్టు వివరించారు. నెలాఖరుకు 83 శాతం పంపిణీ అవుతుందని, సెప్టెంబర్ పది కల్లా పంపిణీని పూర్తి చేస్తామని తెలిపారు. ఆయన వెంట ఎంఈఓ ఎంవీవీ సుబ్బారావు ఉన్నారు.
Advertisement
Advertisement