అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు ఆధ్వర్యంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ బృందం మంగళవారం ఓడలరేవు ఓఎ¯ŒSజీసీ టెర్మినల్‌కు రానున్నారని జిల్లా మత్స్యకార సంక్షేమ సంఘం అధ్యక్షుడు మల్లాడి హనుమంతరావు సోమవారం తెలిపారు. ఓఎ¯ŒSజీసీ
నేడు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రాక
Jan 9 2017 10:45 PM | Updated on Sep 5 2017 12:49 AM
అల్లవరం :
అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు ఆధ్వర్యంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ బృందం మంగళవారం ఓడలరేవు ఓఎ¯ŒSజీసీ టెర్మినల్‌కు రానున్నారని జిల్లా మత్స్యకార సంక్షేమ సంఘం అధ్యక్షుడు మల్లాడి హనుమంతరావు సోమవారం తెలిపారు. ఓఎ¯ŒSజీసీ కార్యకలాపాలతో మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను స్టాండింగ్ కమిటీ దృష్టికి తీసుకెళతామన్నారు. చమురు నిక్షేపాల కోసం చేస్తున్న సిస్మిక్ సర్వే వల్ల మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ముందుగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయకుండా యథేచ్ఛగా సర్వే చేస్తున్నారని ఆరోపించారు. అంతర్వేది నుంచి ఎస్.యానం వరకూ ఉన్న 50 మత్స్యకార గ్రామాలు స్టాండింగ్ కమిటీ ముందు తమ సమస్యలను వివరిస్తాయని తెలిపారు. ఏటా ఓడలరేవు మత్స్యకారులకు ఓఎ¯Œజీసీ ఇచ్చే నిత్యావసరాల కిట్లను ఈ ఏడాది పంపిణీ చేయలేదన్నారు.
Advertisement
Advertisement