గుర్తుతెలియని మహిళ హత్య | Unidentified woman's murder | Sakshi
Sakshi News home page

గుర్తుతెలియని మహిళ హత్య

Dec 18 2016 2:51 AM | Updated on Sep 4 2017 10:58 PM

గుర్తుతెలియని మహిళను హత్య చేసి మండలంలో ని నలగాంపల్లె సమీపంలోని జాతీయ రహదారి పక్కన పడేసి వెళ్లి న సంఘటన కలకలం సృష్టించింది.

నలగాంపల్లె(బంగారుపాళెం): గుర్తుతెలియని మహిళను హత్య చేసి మండలంలో ని నలగాంపల్లె సమీపంలోని జాతీయ రహదారి పక్కన పడేసి వెళ్లి న సంఘటన కలకలం సృష్టించింది. ఈ విషయాన్ని శనివారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ నెట్టికంఠయ్య సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ మహిళను ఎక్కడో హత్య చేసి మృతదేహాన్ని రహదారి పక్కనున్న నరసింహులు పొలం సమీపంలో పడేసి వెళ్లిపోయారని తెలిపారు. ఉరివేసి హత్య చేసినట్టు మెడ చుట్టూ గుర్తులు ఉన్నాయన్నారు. మృతురాలికి 30 ఏళ్లు ఉంటాయని, 5.50 అడుగుల ఎత్తు, ఎర్రగా ఉందన్నారు. ఎర్ర రంగుపై తెల్లచారలు గల నైటీ ధరించిందని తెలిపారు. మెడలో పసుపుదారం, అందులో తమిళ సంప్రదాయానికి చెందిన తాళిబొట్టు ఉందన్నారు. మృతురాలు గర్భిణిగా ఉన్నట్టు తెలుస్తోందన్నా రు. మృతురాలు తమిళనాడు, కర్ణాటకకు చెందినట్లుగా భావిస్తున్నామన్నారు. సం ఘటనా స్థలాన్ని గంగవరం సీఐ రవికుమార్, బంగారుపాళెం తహసీల్దార్‌ మురళి, ఎంపీడీవో దయానంద్‌ పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement