గుర్తుతెలియని మృతదేహం లభ్యం | Unidentified body found in hyderabad | Sakshi
Sakshi News home page

గుర్తుతెలియని మృతదేహం లభ్యం

Aug 4 2016 7:33 PM | Updated on Sep 4 2018 5:21 PM

ఓ గుర్తుతెలియని వ్యక్తి (40) మృతదేహం లభ్యమైన సంఘటన గురువారం సుల్తాన్‌బజార్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది.

ఓ గుర్తుతెలియని వ్యక్తి (40) మృతదేహం లభ్యమైన సంఘటన గురువారం సుల్తాన్‌బజార్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. సుమారు 35 నుంచి 40 సంవత్సరాల వయసు గల ఓ వ్యక్తి కోఠి జైన్‌మందిర్ వద్ద గల ఓ వస్త్ర దుకాణం వద్ద అపస్మారక స్థితిలో పడిఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతుడు తెల్లచొక్కా, నల్ల ఫ్యాంటు ధరించి ఉన్నాడని తెలిపారు. చేతికి ఒక వాచీ, ఉంగరం పెట్టుకుని ఉన్నాడని పోలీసులు, మృతుడు ముస్లిం కావచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ వ్యక్తి సంబంధీకులు ఎవరైనా ఉంటే సుల్తాన్‌బజార్ పోలీసులను సంప్రదించాలన్నారు. ఈ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement