పోలీసుల దెబ్బలు తాళలేక.. | Under trail prisoner attemt suicide in khammam district | Sakshi
Sakshi News home page

పోలీసుల దెబ్బలు తాళలేక..

Feb 9 2017 5:55 PM | Updated on Sep 5 2017 3:18 AM

పోలీసుల దెబ్బలు తాళలేక ఓ విచారణ ఖైదీ ఆత్మహత్యాయత్నం చేశాడు.

సత్తుపల్లి(ఖమ్మం జిల్లా):
పోలీసుల దెబ్బలు తాళలేక ఓ విచారణ ఖైదీ ఆత్మహత్యాయత్నం చేశాడు. తలను గోడకేసి బాదుకోవడంతో తీవ్రరక్త స్రావం అయింది. ఈ సంఘటన సత్తుపల్లి పోలీస్‌స్టేషన్‌లో చోటుచేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా ధర్మాజీగూడెంకు చెందిన వీరయ్యను ఓ దొంగతనం కేసులో పోలీసులు సత్తుపల్లి స్టేషన్‌కు తీసుకువచ్చి విచారణ చేస్తున్నారు.

పోలీసుల దెబ్బలు తాళలేక తలను గోడకేసి వీరయ్య బాదుకున్నాడు. తీవ్రంగా రక్తం కారుతుండటంతో వీరయ్యను చికిత్స నిమిత్తం సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement