అదుపు తప్పి.. ఐదుగురిని ఢీకొట్టి.. | un controlled.. htit 5 persons.. | Sakshi
Sakshi News home page

అదుపు తప్పి.. ఐదుగురిని ఢీకొట్టి..

Oct 8 2016 10:57 PM | Updated on Sep 4 2017 4:40 PM

అదుపు తప్పి.. ఐదుగురిని ఢీకొట్టి..

అదుపు తప్పి.. ఐదుగురిని ఢీకొట్టి..

తణుకు అర్బన్‌: కారు అదుపుతప్పి హల్‌చల్‌ చేయడంతో రోడ్డుపై వెళుతున్న ప్రయాణికులు బెంబేలెత్తారు. హఠాత్తు పరిణామంతో స్థానికులు కంగారుపడ్డారు.

 తణుకు అర్బన్‌: కారు అదుపుతప్పి హల్‌చల్‌ చేయడంతో రోడ్డుపై వెళుతున్న ప్రయాణికులు బెంబేలెత్తారు. హఠాత్తు పరిణామంతో స్థానికులు కంగారుపడ్డారు. శనివారం సాయంత్రం తణుకు పాత రూరల్‌ పోలీస్‌స్టేçÙన్‌ వద్ద జరిగిన ప్రమాదానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పెనుమంట్ర తహసిల్దార్‌ కార్యాలయ ఆర్‌ఐ కోట శ్రీనివాసకుమార్‌ కారులో పెరవలి వైపు వెళుతుండగా తణుకు పాత రూరల్‌ స్టేషన్‌ వద్దకు వచ్చేసరికి ఫిట్స్‌ వచ్చాయి. 
దీంతో కారు అదుపు తప్పింది. రోడ్డుపై వెళుతున్న పాదచారులు, రెండు మోటారుసైకిళ్లు, రెండు సైకిళ్లను ఢీకొట్టింది. ముందుగా పట్టణానికి చెందిన పాదచారుడు కొక్కిరాల నాగశ్రీనివాస్‌ను ఢీకొనగా అతడు పక్కన ఉన్న డ్రెయిన్‌లో పడ్డారు. తర్వాత ఆచంటకు చెందిన నెక్కంటి నగేష్‌ను, బొక్కా వెంకట కృష్ణారావును ఢీకొట్టింది. వీరితో పాటు మరో ఇద్దరినీ కారు ఢీకొంది. వీరిలో నెక్కంటి నగేష్‌ కడుపుపై నుంచి కారు వెళ్లడంతో స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అతడికి మూడుచోట్ల ఎముకలు విరిగాయి. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు అన్నారు. బొక్కా వెంకట కృష్ణారావుకు ఎముకలు విరగడంతో ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. స్వల్పగాయాలైన నాగశ్రీనివాస్‌ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి కారణమైన కోట శ్రీనివాసకుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా డ్రైవర్‌కు ఫిట్స్‌ వస్తే కారు రూరల్‌ పోలీస్‌స్టేçÙన్‌ నుంచి ఎన్టీఆర్‌ పార్కు వరకు ఎలా వెళ్తుందనే అనుమానాన్ని బాధితులు వ్యక్తం చేస్తున్నారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement