వేగంగా వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో ఇద్దరు కూలీలు మృతిచెందారు.
నర్సింహులుపేట(వరంగల్): వేగంగా వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో ఇద్దరు కూలీలు మృతిచెందారు. వరంగల్ జిల్లా నర్సింహులుపేట మండలం ఆగపేట శివారులోని దుబ్బతండా వద్ద ఆదివారం ఉదయం ట్రాక్టర్ బోల్తా కొట్టింది. దీంతో ట్రాక్టర్‌లో వెళ్తున్న తండాకు చెందిన ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.