పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ఓ డీసీఎం వ్యాన్ రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరు మృతి చెందారు.
ఇద్దరు మృతి, మరో ఐదుగురికి గాయాలు
యాలల (రంగారెడ్డి జిల్లా)
పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ఓ డీసీఎం వ్యాన్ రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరు మృతి చెందగా, మరో ఐదుగురురికి తీవ్రగాయాలైన సంఘటన యాలాల మండలం దండమీదపల్లి గ్రామంలో బుధవారం జరిగింది. మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ మండలంలోని అన్నారం గ్రామాస్తులు కర్ణాటకలో ఓ పెళ్లికి హాజరయై తిరిగి వస్తున్నారు. యాలల మండలం దండమీదపల్లి వద్ద డీసీఎం వ్యాన్ వెనుక డోర్ ఊడిపోయింది. వెనక భాగంలోని వారు రోడ్డుపై పడ్డారు. అందులో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందగా, మరో ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. మృతులు మహబూబ్‌నగర్ అన్నారానికి చెందిన నర్సింహులు(20), పెంటయ్య(14) గా గుర్తించారు.