అతివేగానికి ఇద్దరు బలి | Two high-speed dead | Sakshi
Sakshi News home page

అతివేగానికి ఇద్దరు బలి

Sep 4 2016 11:48 PM | Updated on Sep 4 2017 12:18 PM

రఘునాథపల్లి – కంచనపల్లి రహదారిపై ఆదివారం రాత్రి రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరొకరు చికిత్సపొందుతూ మృతి చెందాడు.

  • ∙ఎదురెదురుగా వచ్చి ఢీకొన్న  రెండు బైక్‌లు
  • ∙ఒకరి పరిస్థితి విషమం
  • రఘునాథపల్లి : రఘునాథపల్లి – కంచనపల్లి రహదారిపై ఆదివారం రాత్రి రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరొకరు చికిత్సపొందుతూ మృతి చెందాడు. ఇంకొకరు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. కంచనపల్లికి చెందిన మంచోజు బ్ర హ్మచారి(54) కొన్నేళ్ల కిత్రం జనగామ మండ లం వడ్లకొండలోని అత్తగారింటికి ఇల్లరికం పోయి అక్కడే నివాసముంటున్నాడు. కంచనపల్లిలో జరిగిన తన తల్లి సంవత్సరీకం కార్యక్రమానికి బ్రహ్మచారి ద్విచక్రవాహనంపై వచ్చా డు. ఆదివారం రాత్రి బైక్‌పై తిరిగి వెళుతుండ గా, భాంజీపేట శివారు పిట్టలగూడేనికి చెందిన కావ్య రాంగోపాల్‌(40), కావ్య రాజులు ద్విచక్రవాహనంపై కంచనపల్లి వైపు వస్తున్నారు. కంచనపల్లి ఎస్సీ కాలనీ సమీపంలోని కల్వర్ట్‌ వద్ద రెండు బైకులు వేగంగా, ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బ్రహ్మచారి అక్కడికక్కడే మృతిచెందాడు.
     
    మరో బైకుపై ఉన్న పిట్టలగూడెం వాసులు రాంగోపాల్, రాజులు తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను 108లో జనగామ ఏరియా అసుపత్రికి తరలిం చగా చికిత్స పొందిన కొద్ది సేపటికి రాంగోపాల్‌ మృతి చెందాడు. మృతుడు బ్రహ్మచారికిSభార్య నాగలక్ష్మి, కూతురు శ్రావణి, కుమారుడు సంతోష్‌ ఉన్నారు. మృతుడు రాంగోపాల్‌కు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. ఎస్సై రంజిత్‌రావు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement