బైక్‌ను ఢీకొట్టిన టిప్పర్.. ఇద్దరి మృతి | Sakshi
Sakshi News home page

బైక్‌ను ఢీకొట్టిన టిప్పర్.. ఇద్దరి మృతి

Published Sat, Oct 22 2016 6:31 PM

two dies in bike,tipper collission in chittor district

రేణిగుంట(చిత్తూరు): ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి వద్ద శనివారం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న టిప్పర్ ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది.

దీంతో ద్విచక్రవాహనంపై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement