పీఠాధిపతికి తులాభారం | tulabharam for peethadhipathi | Sakshi
Sakshi News home page

పీఠాధిపతికి తులాభారం

Sep 14 2016 9:54 PM | Updated on Sep 4 2017 1:29 PM

పీఠాధిపతికి తులాభారం

పీఠాధిపతికి తులాభారం

శ్రీరాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులకు బుధవారం రాత్రి తులాభారం నిర్వహించారు.

మంత్రాలయం : శ్రీరాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులకు బుధవారం రాత్రి తులాభారం నిర్వహించారు. శ్రీమఠం ప్రాకారంలో ఈశాన్య భాగంలోని తులాభారం కౌంటర్‌లో పండ్లు, రూపాయి నాణేలతో తక్కెడలో తూచారు. ఆదోనికి చెందిన రాఘవేంద్రరావు దాతృత్వంతో తులాభారం గావించారు. తులాభారం వేడుక భక్తులను కనువిందు చేసింది. అలాగే గురువారం నిర్వహించే అనంత పద్మనాభ స్వామి వ్రతం సందర్భంగా వెండి విగ్రహ రథాన్ని కానుకగా రాఘవేంద్రరావు పీఠాధిపతికి అందజేశారు. మేనేజర్‌ శ్రీనివాసరావు, అసిస్టెంట్‌ మేనేజర్‌ ఐపీ నరసింహమూర్తి, ధార్మిక సహాయక అధికారి వ్యాసరాజాచార్‌ పాల్గొన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement