వాస్తవం చెబితే సీఎంకు రుచించదా! | truth not digast to cm | Sakshi
Sakshi News home page

వాస్తవం చెబితే సీఎంకు రుచించదా!

Jan 2 2017 11:58 PM | Updated on May 29 2018 4:26 PM

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వాస్తవం చెబితే రుచించదా అని వైఎస్‌ఆర్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగాల భరత్‌కుమార్‌రెడ్డి విమర్శించారు.

– సభలో ఎమ్మెల్యే ఐజయ్య మైక్‌ కట్‌ చేయడం అవమానకరం
– వైఎస్‌ఆర్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగాల భరత్‌కుమార్‌రెడ్డి
కర్నూలు (ఓల్డ్‌సిటీ):ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వాస్తవం చెబితే రుచించదా అని వైఎస్‌ఆర్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగాల భరత్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ముచ్చుమర్రి, కేసీ కెనాల్‌ ఆయకట్టు కోసం నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించారని గుర్తు చేశారు. 2014లోనే దాదాపుగా 70 శాతం నిర్మాణ పనులు పూర్తయితే, చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా 30 శాతం పనులు కూడా పూర్తి చేయలేకపోయారన్నారు. తనే పూర్తి చేసినట్లు రైతుల్ని నమ్మించడానికే చంద్రబాబు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారని ఆరోపించారు. వేదికపై నందికొట్కూరు శాసన సభ్యుడు ఐజయ్య వాస్తవాలు తెలిపేందుకు ప్రయత్నించగా ఆయన మైక్‌ కట్‌చేసి నాయకులచేత బలవంతంగా అక్కడ్నుంచి పంపివేయడం అవమానకరమన్నారు. ఈ ఘటనను వైఎస్‌ఆర్‌సీపీ రైతు విభాగం తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.  చంద్రబాబు చెప్పే అబద్ధాలను రైతులు నమ్మే పరిస్థితుల్లో లేరని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement