వర్షాలతో ఆలస్యంగా నడిచిన రైళ్లు | trains delayed due to rains | Sakshi
Sakshi News home page

వర్షాలతో ఆలస్యంగా నడిచిన రైళ్లు

Sep 23 2016 11:35 PM | Updated on Sep 4 2017 2:40 PM

సోంపేట స్టేషన్‌లో ఆగి ఉన్న హౌరా–తిరుచునాపల్లి ఎక్స్‌ప్రెస్‌

సోంపేట స్టేషన్‌లో ఆగి ఉన్న హౌరా–తిరుచునాపల్లి ఎక్స్‌ప్రెస్‌

రాష్ట్రంలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నదులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. కొన్ని చోట్ల రైల్వే ట్రాక్‌లు దెబ్బతిన్నాయి. దీంతో పలు రైళ్లు శుక్రవారం ఆలస్యంగా నడిచాయి. సోంపేట, ఇచ్ఛాపురం స్టేషన్‌ల మీదుగా విశాఖపట్నం వైపు వెళ్లే రైళ్లు సుమారు రెండు గంటల పాటు ఆలస్యంగా ప్రయాణించాయి. ఉదయం ప్రశాంతి, హౌరా–చెన్నై సూపర్‌ఫాస్ట్‌ మెయిల్, ఇంటర్‌ సిటీ, విశాఖ, హౌరా–తిరుచినాపల్లి ...

కంచిలి: రాష్ట్రంలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నదులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. కొన్ని చోట్ల రైల్వే ట్రాక్‌లు దెబ్బతిన్నాయి. దీంతో  పలు రైళ్లు శుక్రవారం ఆలస్యంగా నడిచాయి. సోంపేట, ఇచ్ఛాపురం స్టేషన్‌ల మీదుగా విశాఖపట్నం వైపు వెళ్లే రైళ్లు సుమారు రెండు గంటల పాటు ఆలస్యంగా ప్రయాణించాయి. ఉదయం ప్రశాంతి, హౌరా–చెన్నై సూపర్‌ఫాస్ట్‌ మెయిల్, ఇంటర్‌ సిటీ, విశాఖ, హౌరా–తిరుచినాపల్లి ఎక్స్‌ప్రెస్‌లు గంటల తరబడి స్టేషన్‌లో నిలిపివేశారు. ప్రయాణికులకు ఇబ్బందులు తప్పలేదు.

 

Advertisement
 
Advertisement
Advertisement