మెదక్ జిల్లాకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మంజూరు | Traffic police station sancations for Medak district | Sakshi
Sakshi News home page

మెదక్ జిల్లాకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మంజూరు

Dec 23 2015 9:16 PM | Updated on Sep 3 2017 2:27 PM

మెదక్ జిల్లా రామచంద్రాపురం వద్ద ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

సాక్షి, హైదరాబాద్: మెదక్ జిల్లా రామచంద్రాపురం వద్ద ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈమేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్‌త్రివేది బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వాహనాల రద్దీని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర డీజీపీ అనురాగ్‌శర్మ సూచన మేరకు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నూతన పోలీసు స్టేషన్‌కు ఒక సీఐ, ఎనిమిది మంది సబ్‌ఇన్‌స్పెక్టర్లు, ఆరుగురు హెడ్ కానిస్టేబుళ్లు, 28 మంది కానిస్టేబుళ్ల సిబ్బందిని నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement