ఆదుకుంటారనుకుంటే ఆవు కథ చెబుతారా? | TPCC chief Uttam kumar reddy Comments on pm modi | Sakshi
Sakshi News home page

ఆదుకుంటారనుకుంటే ఆవు కథ చెబుతారా?

Aug 8 2016 2:56 AM | Updated on Mar 18 2019 8:56 PM

ఆదుకుంటారనుకుంటే ఆవు కథ చెబుతారా? - Sakshi

ఆదుకుంటారనుకుంటే ఆవు కథ చెబుతారా?

ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనతో తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమి లేదని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ విమర్శించారు.

ప్రధాని పర్యటనపై ‘ఉత్తమ్’ విమర్శ
సిద్దిపేట జోన్ /వీణవంక: ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనతో తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమి లేదని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ విమర్శించారు. ఆదివారం మెదక్ జిల్లా సిద్దిపేట, కరీంనగర్ జిల్లా వీణవంకలో వేర్వేరుగా విలేకరులతో మాట్లాడారు. సాగునీటి ప్రాజెక్టులకు జాతీయహోదా ప్రకటన చేయకపోవడం బాధాకరమన్నారు. తెలంగాణను ఆదుకుంటారని ప్రధాని మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రజలకు ఆయన ఆవు కథ చెప్పి వెళ్లడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఏదో ఒక మంచి ప్రకటన, హామీ ఇచ్చి వెళ్తారని ఎదురు చూశామని, కానీ కచ్చితమైన మాట చెప్పలేకపోయారని పేర్కొన్నారు. ప్రధాని పర్యటనకు ప్రభుత్వం రూ.10 కోట్ల ప్రజాధనాన్ని ఆర్భాటంగా ఖర్చు చేసిందని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement