అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న నియోజకవర్గాలు అంటూ ముఖ్యమంత్రి ఎ¯ŒS.చంద్రబాబు నాయుడు ర్యాంకులు ప్రకటించారు. రాష్ట్రంలో టాప్–12 నియోజకవర్గాల జాబితాను బుధవారం ప్రకటించగా.. అందులో ఆరు నియోజకవర్గాలు మన జిల్లావే కావడం గమనార్హం.
టాప్–12 ర్యాంకుల్లో సగం మనకే
Dec 22 2016 2:32 AM | Updated on Mar 28 2019 5:27 PM
సాక్షి ప్రతినిధి, ఏలూరు : అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న నియోజకవర్గాలు అంటూ ముఖ్యమంత్రి ఎ¯ŒS.చంద్రబాబు నాయుడు ర్యాంకులు ప్రకటించారు. రాష్ట్రంలో టాప్–12 నియోజకవర్గాల జాబితాను బుధవారం ప్రకటించగా.. అందులో ఆరు నియోజకవర్గాలు మన జిల్లావే కావడం గమనార్హం. పైగా మొదటి నాలుగు స్థానాలు జిల్లాకే దక్కాయి. బుధవారం విజయవాడలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేశారు. గోపాలపురం నియోజకవర్గానికి రాష్ట్రంలోనే మొదటి స్థానం దక్కగా, రెండో స్థానంలో భీమవరం, మూడో స్థానంలో ఉంగుటూరు, నాలుగో స్థానంలో ఉండి నియోజకవర్గాలు ఉన్నాయి. 8వ స్థానంలో నిడదవోలు, 9వ స్థానంలో తణుకు నిలిచాయి. 14 అంశాల ఆధారంగా నియోజకవర్గాలకు ర్యాంకులు ప్రకటించారు. జీవీఏ (గ్రాస్ వేల్యూ ఆడిట్), తలసరి ఆదాయం, నీరు–ప్రగతి, మీ కోసం ఫిర్యాదుల పరిష్కారం, ఎన్టీఆర్ వైద్యసేవ, ఎన్టీఆర్ భరోసా, పెన్షన్ల పంపిణీ, రోడ్ల పరిస్థితి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ర్యాంకులు ఇచ్చినట్టు ప్రకటించారు. ఈ ప్రకటనపై జిల్లాలోని ఇతర నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు పెదవి విరుస్తున్నారు.
Advertisement
Advertisement