కర్నూలు నగరానికి ఆదివారం రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ రానున్నట్లు తెలిసింది. మున్సిపల్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి కర్నూలుకు వస్తున్న ఆయన నగరపాలక పరిధిలో విస్త్రృతంగా పర్యటిస్తారని సమాచారం.
రేపు మున్సిపల్ శాఖ మంత్రి రాక?
Oct 22 2016 1:07 AM | Updated on Aug 30 2019 8:37 PM
కర్నూలు(టౌన్): కర్నూలు నగరానికి ఆదివారం రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ రానున్నట్లు తెలిసింది. మున్సిపల్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి కర్నూలుకు వస్తున్న ఆయన నగరపాలక పరిధిలో విస్త్రృతంగా పర్యటిస్తారని సమాచారం. ఈ నేపథ్యంలో పలు అభివృద్ధి పనులకు ఆయనచే శంకుస్థాపన చేయించేందుకు మున్సిపల్ అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. నగరశివారులోని తడకనపల్లెలో రూ.10 కోట్లు వెచ్చించి నిర్మించనున్న ఫిల్టర్‌బెడ్ పనులకు శంకుస్థాపన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో కర్నూలు నగరపాలక సంస్థకు ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో మంత్రి పర్యటన సమాచారం ప్రాధాన్యతను సంతరించుకుంది.
Advertisement
Advertisement