ఈనెల 14వ తేదీ ఉదయం 10 గంటల నుంచి రాజంపేట పట్టణంలోని జీఎంసీ కళామందిర్‌లో భారతరాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్.అంబేద్కర్ జయంతి వేడుకను ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నట్లు అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ గౌరవాధ్యక్షులు ఎన్.శివరామయ్య, అధ్యక్షులు ఎస్.రామాంజులు ఒక ప్రకటనలో తెలిపారు.
రాజంపేట రూరల్ : ఈనెల 14వ తేదీ ఉదయం 10 గంటల నుంచి రాజంపేట పట్టణంలోని జీఎంసీ కళామందిర్‌లో భారతరాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్.అంబేద్కర్ జయంతి వేడుకను ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నట్లు అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ గౌరవాధ్యక్షులు ఎన్.శివరామయ్య, అధ్యక్షులు ఎస్.రామాంజులు ఒక ప్రకటనలో తెలిపారు. అంబేడ్కర్ జయంతి వేడుకలో డివిజన్‌లోని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు పెద్దఎత్తున పాల్గొనాలని వారు కోరారు. అలాగే భరతమాత ముద్దు బిడ్డ అయిన అంబేద్కర్ జయంతిని ప్రజలు వాడవాడలా ఓ పండుగలా నిర్వహించాలని కోరారు. జీఎంసీలో జరిగే అంబేడ్కర్ జయంతి వేడుకలకు ముఖ్య అతిధులుగా ప్రభుత్వ విప్ మేడా మల్లిఖార్జునరెడ్డి, ఆర్డీఓ వీరబ్రహ్మం, డీఎస్పీ రాజేంద్రలు పాల్గొంటారని వారు తెలిపారు.