కడప నగరంలోని చెమ్ముమియాపేట జిల్లాపరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో బుధవారం జిల్లాస్థాయి రోప్ స్కిప్పింగ్ ఎంపికలు నిర్వహించనున్నట్లు ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి ఎల్.ఎ. సునీల్, రోప్‌స్కిప్పింగ్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి గణేష్ ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు.
కడప స్పోర్ట్స్ : కడప నగరంలోని చెమ్ముమియాపేట జిల్లాపరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో బుధవారం జిల్లాస్థాయి రోప్ స్కిప్పింగ్ ఎంపికలు నిర్వహించనున్నట్లు ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి ఎల్.ఎ. సునీల్, రోప్‌స్కిప్పింగ్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి గణేష్ ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. అండర్–14, అండర్–17 విభాగాల్లో ఈ ఎంపికలు ఉంటాయన్నారు. జిల్లా జట్టుకు ఎంపికైన క్రీడాకారులు ఈనెల 17 నుంచి 19వ తేదీ వరకు పశ్చిమగోదావరి జిల్లాలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని తెలిపారు.