శ్వేతగజవాహనంపై కొండమీదరాయుడు | Sakshi
Sakshi News home page

శ్వేతగజవాహనంపై కొండమీదరాయుడు

Published Thu, Feb 9 2017 10:49 PM

శ్వేతగజవాహనంపై కొండమీదరాయుడు

బుక్కరాయసముద్రం : మండలంలోని కొండమీదరాయుడు స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి కొండమీదరాయుడు శ్వేత గజ వాహనంపై స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు శ్రీవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. పుర వీధుల్లో వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగించారు.

అలాగే  శుక్రవారం తెల్లవారు జామున 4 గంటలకు శ్రీవారు భూదేవి, శ్రీదేవికి కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు పుర వీధుల్లో శ్రీవారిని, భూదేవి, శ్రీదేవిని సూర్య ప్రభ వాహనంపై మండల కేంద్రంలో ఊరేగించనున్నారు. 11 గంటలకు  రథోత్సవం ఉంటుందని ఆలయ అర్చకులు తెలిపారు.  

Advertisement
 
Advertisement
 
Advertisement