నేత్రపర్వం.. రథోత్సవం | rathothsavam in madakasira | Sakshi
Sakshi News home page

నేత్రపర్వం.. రథోత్సవం

May 10 2017 11:06 PM | Updated on Sep 5 2017 10:51 AM

నేత్రపర్వం.. రథోత్సవం

నేత్రపర్వం.. రథోత్సవం

మడకశిరలోని కోట లక్ష్మీ వెంకటరమణస్వామి రథోత్సవం బుధవారం నేత్రపర్వంగా సాగింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

మడకశిర : మడకశిరలోని కోట లక్ష్మీ వెంకటరమణస్వామి రథోత్సవం బుధవారం నేత్రపర్వంగా సాగింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. తొలుత రథంలో ఉత్సవ విగ్రహాన్ని కొలువుదీర్చి పూజలు చేశారు. ఆ తర్వాత దేవాలయం నుంచి తేరువీధి వరకు రథాన్ని లాగారు. తేరు లాగడానికి భక్తులు పోటీపడ్డారు. ఎమ్మెల్యే ఈరన్న, ఎమ్మెల్సీ గుండుమలతిప్పేస్వామి, మునిసిపల్‌ కమిషనర్‌ సంగం శ్రీనివాసులు, చైర్‌పర్సన్‌ శరణ్య, కౌన్సిలర్లు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.

అంతకుముందు ఆయన దేవాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ప్రభుత్వం తరపున తహసీల్దార్‌ హరిలాల్‌నాయక్, డీటీ శ్యామలాదేవి తదితరులు పట్టు వస్త్రాలను శ్రీవారికి సమర్పించారు.  మాజీ ఎమ్మెల్యే వైవీ తిమ్మారెడ్డి జ్ఞాపకార్థం వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి వైసీ గోవర్ధన్‌రెడ్డి కుటుంబ సభ్యులు కూడా శ్రీ వారికి పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు చేయించారు. శ్రీ అయ్యప్పస్వామి సేవా సమితి ఆధ్వర్యంలో ఎల్‌ఐసీ ఏజెంట్‌ శ్రీనివాసరావు భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement