నేడు పర్యావరణ ర్యాలీ | today environment rally | Sakshi
Sakshi News home page

నేడు పర్యావరణ ర్యాలీ

Jun 5 2017 12:24 AM | Updated on Sep 5 2017 12:49 PM

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం ఉదయం 7.30 గంటలకు పర్యావరణ ర్యాలీని కలెక్టర్‌ సత్యనారాయణ ప్రారంభించనున్నట్లు కాలుష్య నియంత్రణ మండలి జోనల్‌ అధికారి రాజేంద్రరెడ్డి ఆదివారం ప్రకటనలో తెలిపారు.

– ఉదయం 7.30 గంటలకు కలెక్టరేట్‌ దగ్గర ప్రారంభం
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం ఉదయం 7.30 గంటలకు పర్యావరణ ర్యాలీని కలెక్టర్‌ సత్యనారాయణ ప్రారంభించనున్నట్లు కాలుష్య నియంత్రణ మండలి జోనల్‌ అధికారి రాజేంద్రరెడ్డి ఆదివారం ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్‌ నుంచి జెడ్పీ వరకు సాగే ర్యాలీలో నగరంలోని వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులు హాజరై జయప్రదం చేయాలని కోరారు. అనంతరం 11 గంటలకు జెడ్పీ కాన్ఫరెన్స్‌ హాలులో ప్రపంచ పర్యావరణ దినోత్సవంపై ప్రజలకు అవగాహన సదస్సు ఉంటుందని, ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్‌, డీఎఫ్‌ఓ  హాజరవుతారని ఆయన వెల్లడించారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement