వెంకటాయపాలెం దళితుల శిరోముండనం కేసు విచారణకు వస్తున్న సమయంలో రెండు రోజుల ముందు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను తొలగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీఓను నిరసిస్తూ రామచంద్రపురంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా నిర్వహిస్తున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పెట్టా శ్రీనివాసరావు ప్రకటించారు. ఆయన, పార్టీ నాయకులు పండు గోవిందరాజు, బత్తుల అప్పారావు, జనిపెల్ల సాయి, చిల్లే నాగేశ్
దళిత వ్యతిరేక జీఓకు నిరసనగా నేడు ధర్నా
Sep 25 2016 10:08 PM | Updated on Sep 4 2017 2:58 PM
తాళ్లపూడి(కె.గంగవరం) :
వెంకటాయపాలెం దళితుల శిరోముండనం కేసు విచారణకు వస్తున్న సమయంలో రెండు రోజుల ముందు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను తొలగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీఓను నిరసిస్తూ రామచంద్రపురంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా నిర్వహిస్తున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పెట్టా శ్రీనివాసరావు ప్రకటించారు. ఆయన, పార్టీ నాయకులు పండు గోవిందరాజు, బత్తుల అప్పారావు, జనిపెల్ల సాయి, చిల్లే నాగేశ్వరరావు, సాదే నారాయణమూర్తి ఆదివారం తాళ్లపూడిలో విలేకరులతో మాట్లాడారు. 20 ఏళ్లుగా స్టేలతో నడిపించుకు వస్తున్న శిరోముండనం కేసు ఎట్టకేలకు విచారణకు రాగా ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యేకు కొమ్ముకాస్తు జీవోను విడుదల చేసిందని ఆరోపించారు. ఎటువంటి కారణమూ లేకుండా పీపీని తొలగించడం ప్రభుత్వం అనుసరిస్తున్న దళిత వ్యతిరేక విధానాలను సూచిస్తోందన్నారు. ప్రభుత్వ చర్యను నిరసిస్తు సోమవారం రామచంద్రపురంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద జరిగే ధర్నాకు నియోజకవర్గంలోని దళితులు, దళిత సంఘాల నేతలు తరలిరావాలని వారు పిలుపునిచ్చారు.
Advertisement
Advertisement