breaking news
today darna
-
‘ఆశ’ల బతుకు పోరు
జిల్లాలో 4,500 మంది ‘ఆశ’ వర్కర్లు పనికి దక్కని పారితోషికం డిమాండ్ల సాధనకు నేడు కలెక్టరేట్ వద్ద ధర్నా గ్రామ సీమల్లో వైద్య సేవలనేసరికి ఠక్కున ప్రత్యక్షమయ్యేవారు ఆశ వర్కర్లు. చాకిరీ ఎక్కువ ప్రతిఫలం తక్కువ అన్నరీతిగా తయారైంది వారి పరిస్థితి. దాంతో వారు దశలవారీగా ప్రభుత్వంపై పోరుకు సిద్ధమయ్యారు. రాయవరం: గ్రామాల్లో ఏ కార్యక్రమం జరిగినా వారు ఉండాల్సిందే. ఆరోగ్య శిబిరాలు, గర్భిణులు, బాలింతలు, టీబీ పేషెంట్లకు సేవలు, 104 వాహనం వస్తే రోగులను తీసుకురావడం, పారిశుద్ధ్య కార్యక్రమాలు, ఆధార్ సీడింగ్.. ఇలా అన్నింటికీ వారు తప్పనిసరి. వారికి జీతభత్యాలు లేవు. ఇచ్చేది గౌరవ వేతనం. అదీ ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఆ నేపథ్యంలో దశలవారీగా ప్రభుత్వంపై పోరాటానికి వారు సిద్ధమయ్యారు. అందులో భాVýæంగా సొమవారం కలెక్టరేట్ వద్ద ధర్నాకు ఆశ వర్కర్లు సన్నాహాలు చేస్తున్నారు. రెండేళ్ల నుంచి టీఏ, డీఏలు కట్.. ప్రస్తుతం జిల్లాలోఉన్నS 120 ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల్లో 4,500 మంది ఆశ వర్కర్లు విధులు నిర్వహిస్తున్నారు. రెండేళ్లుగా ప్రభుత్వం ఆశ కార్యకర్తలకు టీఏ, డీఏలను నిలిపేసింది. ఎన్నెన్నో కష్టాలు పడి కుటుంబ నియంత్రణ ఆపరేష¯ŒS చేయిస్తే ఇచ్చే రూ.150 కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఏటా వీరికి ఇవ్వాల్సిన యూనిఫాం నాలుగేళ్లుగా అందజేయలేదు. వీరు నిర్వహించే రికార్డులను పారితోషికం ఖర్చుతోనే కొనుగోలు చేసుకోవాల్సి వస్తోంది. శ్రమకు తగ్గ ఫలితం లేదు విధుల్లో భాగంగా గ్రామాల్లో తిరుగుతున్నాం. జీతభత్యాల్లేని ఉద్యోగంలా ఉంది. మేము పడుతున్న శ్రమకు తగిన ఫలితం దక్కడం లేదు. – జి.బేబి, ఆశ వర్కర్, చెల్లూరు, రాయవరం మండలం కనీసం రూ.5 వేల వేతనం ఇవ్వాలి పారితోషికం కాకుండా కనీస వేతనంగా నెలకు రూ.5వేలు చెల్లించాలి. ప్రభుత్వం మా సమస్యలను సత్వరం పరిష్కరించాలి. –ఎం.వీరలక్ష్మి, జిల్లా గౌరవ అధ్యక్షురాలు, ఆశ వర్కర్ల అసోసియేషన్, కాకినాడ పోరుబాట తప్పడం లేదు.. డిమాండ్ల సాధనకు పోరుబాట తప్పడం లేదు. ఈ నెల 19న కలెక్టరేట్ వద్ద ధర్నా చేపడుతున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా మా డి మాండ్ల సాధనకు చిత్తశుద్ధితో కృషి చేయాలి. – చంద్రమళ్ల పద్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఆశ వర్కర్ల అసోసియేషన్, కాకినాడ. కనీస వేతనం కూడా దక్కడం లేదు ప్రభుత్వం కూలీలకు నిర్ణయించిన కనీస వేతనం కూడా ఆశ వర్కర్లకు దక్కడం లేదు. పనికి తగ్గ పారితోషికం చెల్లిస్తానని చెప్పిన ప్రభుత్వం ఆశ వర్కర్లకు కనీస వేతనం చెల్లించాలి. – సీహెచ్.లక్ష్మి, ఆశ కార్యకర్త, రాయవరం -
దళిత వ్యతిరేక జీఓకు నిరసనగా నేడు ధర్నా
తాళ్లపూడి(కె.గంగవరం) : వెంకటాయపాలెం దళితుల శిరోముండనం కేసు విచారణకు వస్తున్న సమయంలో రెండు రోజుల ముందు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను తొలగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీఓను నిరసిస్తూ రామచంద్రపురంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా నిర్వహిస్తున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పెట్టా శ్రీనివాసరావు ప్రకటించారు. ఆయన, పార్టీ నాయకులు పండు గోవిందరాజు, బత్తుల అప్పారావు, జనిపెల్ల సాయి, చిల్లే నాగేశ్వరరావు, సాదే నారాయణమూర్తి ఆదివారం తాళ్లపూడిలో విలేకరులతో మాట్లాడారు. 20 ఏళ్లుగా స్టేలతో నడిపించుకు వస్తున్న శిరోముండనం కేసు ఎట్టకేలకు విచారణకు రాగా ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యేకు కొమ్ముకాస్తు జీవోను విడుదల చేసిందని ఆరోపించారు. ఎటువంటి కారణమూ లేకుండా పీపీని తొలగించడం ప్రభుత్వం అనుసరిస్తున్న దళిత వ్యతిరేక విధానాలను సూచిస్తోందన్నారు. ప్రభుత్వ చర్యను నిరసిస్తు సోమవారం రామచంద్రపురంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద జరిగే ధర్నాకు నియోజకవర్గంలోని దళితులు, దళిత సంఘాల నేతలు తరలిరావాలని వారు పిలుపునిచ్చారు.