నేడు ఫర్టిగేషన్‌పై అవగాహన సదస్సు | today awareness programme on fertigation | Sakshi
Sakshi News home page

నేడు ఫర్టిగేషన్‌పై అవగాహన సదస్సు

Sep 15 2016 12:24 AM | Updated on Sep 4 2017 1:29 PM

ఉద్యానశాఖ, ఏపీఎంఐపీ, కోరమాండల్‌ కంపెనీ ఆధ్వర్యంలో గురువారం స్థానిక ప్రాంతీయ ఉద్యాన శిక్షణా కేంద్రంలో ఫర్టిగేషన్‌ అంశంపై సదస్సు ఏర్పాటు చేసినట్లు ఉద్యానశాఖ డీడీ బీఎస్‌ సుబ్బరాయుడు తెలిపారు.

అనంతపురం అగ్రికల్చర్‌ : ఉద్యానశాఖ, ఏపీఎంఐపీ, కోరమాండల్‌ కంపెనీ ఆధ్వర్యంలో గురువారం స్థానిక ప్రాంతీయ ఉద్యాన శిక్షణా కేంద్రంలో ఫర్టిగేషన్‌ అంశంపై సదస్సు ఏర్పాటు చేసినట్లు ఉద్యానశాఖ డీడీ బీఎస్‌ సుబ్బరాయుడు తెలిపారు. అరటి, ఇతర పండ్లతోటలకు డ్రిప్‌ ద్వారా నీటిలో కరిగే రసాయన ఎరువులు ఇవ్వడంలో మెలకువలు, సాంకేతిక అంశాలు, రైతులకు కలిగే ప్రయోజనాలు గురించి తెలియజేస్తామన్నారు. ఏపీఎంఐపీ ఓఎస్‌డీ రమేష్‌తో పాటు ఇరుశాఖల అధికారులు, కంపెనీ ప్రతినిధులు, రైతులు హాజరవుతున్నట్లు తెలిపారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement