మంచినీటి సమస్య తీర్చాలి | To solve the drinking water problem | Sakshi
Sakshi News home page

మంచినీటి సమస్య తీర్చాలి

Aug 2 2016 6:33 PM | Updated on Sep 4 2017 7:30 AM

మంచినీటి సమస్య తీర్చాలి

మంచినీటి సమస్య తీర్చాలి

మాచారం (పెన్‌పహాడ్‌) : మండల పరిధిలోని మాచారం గ్రామంలో నెలకొన్న మంచినీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ గ్రామస్తులు మంగళవారం నేరేడుచర్ల–సూర్యాపేట ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.

మాచారం (పెన్‌పహాడ్‌) : మండల పరిధిలోని మాచారం గ్రామంలో నెలకొన్న మంచినీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ గ్రామస్తులు మంగళవారం నేరేడుచర్ల–సూర్యాపేట ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1, 2, 3వ వార్డుల్లో గత కొన్ని నెలలుగా మంచినీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని వారు తెలిపారు. వార్డుల్లో ఉన్న చేతి పంపులు మరమ్మతులకు నోచుకోవడం లేదన్నారు. గ్రామంలో నూతన బోరు వేసి గ్రామస్తుల మంచినీటి సమస్యను తీర్చాలని వారు కోరారు.  కార్యక్రమంలో గ్రామస్తులు వీరబోయిన సైదులు, నాగరాజు, రణపంగ కృష్ణ, కట్టా సైదులు, దూబని నాగమ్మ, బొల్లక దేవయ్య, మధు, సౌడయ్య, గంగరాజు, గంగమ్మ, నాగమ్మ, సైదమ్మ, కల్పన, వీరమ్మ, ఆంథోని, శ్రీరాములు, వెంకన్న, సైదులు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement