పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి | To save the farmers | Sakshi
Sakshi News home page

పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

Oct 1 2016 8:45 PM | Updated on Oct 1 2018 2:09 PM

పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి - Sakshi

పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

తుంగతుర్తి : ఇటీవల కురిసిన వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వ ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి డిమాండ్‌ చేశారు.

తుంగతుర్తి : ఇటీవల కురిసిన వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వ ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి డిమాండ్‌ చేశారు. శనివారం మండల కేంద్రంలోని వీఎన్‌ భవనంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం వెంటనే సర్వే చేయించి పంటలు నష్టపోయిన, ఇళ్లు కూలిన బాధితులకు నష్టపరిహారం అందించాలని కోరారు. ఎస్సారెస్పీ కాలువల ద్వారా చెరువులను, కుంటలను నింపాలన్నారు. వర్షాల కారణంగా సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. సూర్యాపేటలో ఈ నెల 5, 6 తేదీల్లో జరిగే రాష్ట్ర కమిటీ సమావేశాలు జరుగుతాయన్నారు.  ఈ సమావేశంలో  తిరుందాసు గోపి, ముల్కలపల్లి రాములు, బుర్ర శ్రీనివాస్, బొల్లు యాదగిరి, మూరగుండ్ల లక్ష్మయ్య, పలా సుదర్శన్, చంద్రమౌళి, విజయమ్మ, ఎస్‌.రాములు, లింగయ్య, కుమార్, వెంకటనర్సు, నర్సయ్య, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement