మున్సిపల్‌ కౌన్సిలర్లకు సదుపాయాలు కల్పించాలి | To arrange facilities for muncipal councilars | Sakshi
Sakshi News home page

మున్సిపల్‌ కౌన్సిలర్లకు సదుపాయాలు కల్పించాలి

Jul 26 2016 1:44 AM | Updated on Oct 16 2018 6:35 PM

మున్సిపల్‌ కౌన్సిలర్లకు సదుపాయాలు కల్పించాలి - Sakshi

మున్సిపల్‌ కౌన్సిలర్లకు సదుపాయాలు కల్పించాలి

హుజూర్‌నగర్‌ : రాష్ట్రంలోని మున్సిపల్‌ కౌన్సిలర్లకు ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని తెలంగాణ మున్సిపల్, నగరపంచాయతీ కౌన్సిలర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కేఎల్‌ఎన్‌.ప్రసాద్‌ కోరారు.

హుజూర్‌నగర్‌ : రాష్ట్రంలోని మున్సిపల్‌ కౌన్సిలర్లకు ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని తెలంగాణ మున్సిపల్, నగరపంచాయతీ కౌన్సిలర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కేఎల్‌ఎన్‌.ప్రసాద్‌ కోరారు. సోమవారం స్థానికంగా జరిగిన ఆ సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. కౌన్సిలర్లకు గౌరవ వేతనాన్ని రూ.10 వేలకు పెంచాలన్నారు. హెల్త్‌కార్డులు అందజేయడంతో పాటు రూ.5 లక్షల వరకు ఫండ్‌ను నామినేషన్‌ పద్ధతి ద్వారా ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రైలు, బస్సుల్లో ప్రయాణించేందుకు బస్‌పాస్‌లు జారీ చేయడంతో పాటు ప్రతినెల సెల్‌ఫోన్‌ బిల్లు మంజూరు చేయాలన్నారు. సమావేశంలో నగరపంచాయతీ వైస్‌ చైర్మన్‌ దొంతగాని శ్రీనివాస్‌గౌడ్, కౌన్సిలర్లు జక్కుల నాగేశ్వరరావు, తేజావత్‌ రవినాయక్, మీసాల కిరణ్‌కుమార్, జడ శ్రీనివాస్, తన్నీరు మల్లికార్జున్, నాయకులు కామిశెట్టి రవికుమార్, వల్లపుదాసు కృష్ణ, కుక్కడపు కాశయ్య, చింతకాయల రాము పాల్గొన్నారు. 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement