జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు వ్యక్తులు ఆత్మç ßæత్యకు పాల్పడ్డారు. గణపురం మండలంలోని బస్వరాజ్‌పల్లి గ్రా మానికి చెందిన రిటైర్డ్ సింగరేణి కార్మికుడు బట్టు సమ్మయ్య అలి యాస్ అయిలయ్య(60) క్రిమిసంహారక మందు తాగి బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
వేర్వేరుచోట్ల ముగ్గురి బలవన్మరణం
Sep 8 2016 12:40 AM | Updated on Nov 6 2018 8:04 PM
గణపురం : జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు వ్యక్తులు ఆత్మç ßæత్యకు పాల్పడ్డారు. గణపురం మండలంలోని బస్వరాజ్‌పల్లి గ్రా మానికి చెందిన రిటైర్డ్ సింగరేణి కార్మికుడు బట్టు సమ్మయ్య అలి యాస్ అయిలయ్య(60) క్రిమిసంహారక మందు తాగి బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. సమ్మయ్య ఇటీవల తాగుడుకు బానిసయ్యాడు. ఈ క్రమంలో నిత్యం భార్యతో గొడవపడేవాడు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం కూడా తాగొచ్చి భార్యతో గొడవపడి క్రిమిసంహారక మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ములుగు ప్రభుత్వాస్పత్రికి తరలించగా బుధవారం పరిస్థితి విషమించడంతో ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడికి భార్య లక్ష్మి, నలుగురు కుమారులు ఉం డగా, వారిలో ముగ్గురు మృతిచెందారు. ఒకరు ఉన్నారు. పోలీ సులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement