రహదారులు రక్త సిక్తం.. | three people died in various road accidents | Sakshi
Sakshi News home page

రహదారులు రక్త సిక్తం..

Apr 11 2017 9:09 PM | Updated on Aug 30 2018 4:10 PM

క్రిష్ణగిరిలో సోమవారం రాత్రి వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు.

- వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం
 
హొసూరు : క్రిష్ణగిరిలో సోమవారం రాత్రి వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. క్రిష్ణగిరి సమీపంలోని తెన్నంకొటాయ్‌ గ్రామానికి చెందిన అరుణ్‌పాండ్యన్‌(25) ద్విచక్రవాహనంపై క్రిష్ణగిరిలోని పౌరసరఫరాల గిడ్డంగి వద్దకు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన మరో ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అరుణ్‌పాండ్యన్‌ సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కందికుప్పం సమీపంలోని వేటయ్యన్‌కొటాయ్‌ గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు శ్రీనివాసన్‌(35) ద్విచక్రవాహనంపై క్రిష్ణగిరి– చెన్నై జాతీయ రహదారిలో వెళ్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్‌ను స్థానికులు క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొం‍దుతూ మృతి చెందాడు. ఘటనపై కందికుప్పం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అదే విధంగా డెంకణీకోట తాలూకా తళి సమీపంలోని నాగిరెడ్డిపాళ్యం గ్రామానికి చెందిన రుద్రప్ప(70) తళి సమీపంలోని కురుంగలతూరు గ్రామంలో నివాసముంటున్న కొడుకును చూసేందుకు వెళ్లాడు. సాయంత్రం మనవుడు శశికుమార్‌తో కలిసి ద్విచక్రవాహనంపై నాగిరెడ్డిపాళ్యానికి వస్తుండగా అగళకోట వద్ద వెనుక నుంచి వస్తున్న టెంపో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రుద్రప్ప, శశికుమార్‌లు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వీరిని డెంకణీకోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రుద్రప్ప మృతి చెందాడు. ఘటనపై తళి పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement