జిల్లాలో పనిచేస్తున్న ముగ్గురు సీఐలను బదిలీ చేస్తూ రెండు రోజుల క్రితం డీఐజీ రమణకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
ముగ్గురు సీఐలకు స్థానచలనం
Jul 3 2017 11:26 PM | Updated on Aug 13 2018 2:57 PM
కర్నూలు : జిల్లాలో పనిచేస్తున్న ముగ్గురు సీఐలను బదిలీ చేస్తూ రెండు రోజుల క్రితం డీఐజీ రమణకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆదోని పీసీఆర్‌లో పనిచేస్తూ సెలవుల్లో ఉన్న శ్రీనివాసమూర్తి శ్రీశైలానికి బదిలీ అయ్యారు. అక్కడ పనిచేస్తున్న విజయకృష్ణ గత నెల 30న పదవీ విరమణ చేయడంతో శ్రీనివాసమూర్తిని నియమించారు. ఇంటెలిజెన్స్ విభాగంలో ఎస్‌ఐగా పనిచేస్తున్న రాముకు పదోన్నతి కల్పించి మంత్రాలయానికి బదిలీ చేశారు. కర్నూలు నేర పరిశోధన విభాగంలో అటాచ్ విధుల కింద ఉంటూ డీఐజీ కార్యాలయంలో లైజనింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న మధుసూదన్‌రావును సీసీఎస్‌లోనే నియమిస్తూ డీఐజీ ఉత్తర్వులు ఇచ్చారు.
Advertisement
Advertisement