ఏవోబీలో ఇదే భారీ ఎన్‌కౌంటర్ | This is a huge encounter in eob | Sakshi
Sakshi News home page

ఏవోబీలో ఇదే భారీ ఎన్‌కౌంటర్

Oct 25 2016 2:40 AM | Updated on Oct 9 2018 2:47 PM

ఏవోబీలో  ఇదే భారీ ఎన్‌కౌంటర్ - Sakshi

ఏవోబీలో ఇదే భారీ ఎన్‌కౌంటర్

రాష్ట్ర విభజనకు ముందు.. తరువాత కూడా ఆంధ్ర, ఒడిశా బోర్డర్ అటవీ ప్రాంతంలో సోమవారం ...

సాక్షితో విశాఖ, మల్కన్‌గిరి ఎస్పీలు


మల్కన్‌గిరి నుంచి సాక్షి ప్రత్యేక బృందం: రాష్ట్ర విభజనకు ముందు.. తరువాత కూడా ఆంధ్ర, ఒడిశా బోర్డర్ అటవీ ప్రాంతంలో సోమవారం జరిగిన భారీ ఎన్‌కౌంటరే అతి పెద్దదని విశాఖ జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ, మల్కన్‌గిరి ఎస్పీ మిత్రభాను మహాపాత్రో చెప్పారు. ఒడిశాలోని మల్కన్‌గిరి ఎస్పీ కార్యాలయంలో సాక్షి ప్రతినిధుల బృందంతో వారు ప్రత్యేకంగా మాట్లాడారు. రాష్ట్ర చరిత్రలోనే ఇద్దరు స్టేట్ జోనల్ కమిటీ సభ్యులతో సహా డివిజన్ కమిటీ, ఏరియా కమిటీ సభ్యులు వంటి అత్యంత కీలక మావోయిస్టు నేతలు ఒకేసారి ఎన్‌కౌంటర్‌లో మృతిచెందడం ఇదే తొలిసారన్నారు.

కొంతకాలంగా మావోయిస్టుల ఉద్యమం ముఖ్యనేతలను కోల్పోయి బలహీనపడుతోందని, తాజా ఎన్‌కౌంటర్‌తో చావుదెబ్బతగిలిందని అన్నారు. గాలికొండ ఏరియా దాదాపు అజ్ఞాతంలోకి వెళ్లిపోగా ఇప్పుడు కోరుకొండ, కోరాపుట్ డివిజన్ ఏరియా కమిటీలు కూడా  కన్నాళ్లు విరామం తీసుకుంటాయన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో తమ బలగాలు అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించినప్పటికీ ఒక గ్రేహౌండ్ సభ్యుడిని కోల్పోవడం బాధాకరమన్నారు. 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement