గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో వైన్‌షాపులో చోరీ జరిగింది.
	సత్తెనపల్లి(గుంటూరు): గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో వైన్‌షాపులో చోరీ జరిగింది. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని రెడ్ వైన్స్‌లో మంగళవారం రాత్రి దొంగలు పడి రూ. 50 వేలు విలువైన మద్యం సీసాలను ఎత్తుకెళ్లారు.
	
	బుధవారం ఇది గుర్తించిన షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
