ఆలయంలో దొంగలు పడి హుండీలోని సొత్తుతో సహా స్వామివారి ఆభరణాలను ఎత్తుకెళ్లారు.
నకిరికల్లు: ఆలయంలో దొంగలు పడి హుండీలోని సొత్తుతో సహా స్వామివారి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా నకిరికల్లు మండలం నర్సింగపాడు గ్రామంలోని అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరాలయంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం పూజలు నిర్వహించడానికి ఆలయానికి వచ్చిన పూజారి తాళాలు పగలగొట్టి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.